Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ కార్యకర్త రాజేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • చిత్తూరు జిల్లాలోని పెనుమూరులో ఘటన
  • మే 28న జగన్ పై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్
  • వైసీపీ నేత నరసింహారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అసభ్యకరమైన కామెంట్లు చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త రాజేశ్ నాయుడు మే 28న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన వైసీపీ నేత నరసింహారెడ్డి పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఐపీసీ సెక్షన్ 506, ఐటీ చట్టం కింద రాజేశ్ పై కేసు నమోదుచేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆయన్ను ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నారు. ఏప్రిల్ 11న ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమపై రాజేశ్ దాడి చేసినట్లు గతంలోనే వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పుడు కూడా పోలీసులు రాజేశ్ పై కేసు నమోదు చేశారు.

Andhra Pradesh
Chief Minister
Jagan
Facebook
POST
Telugudesam ACTIVIST
RAJESH NAIDU
ARREST
Chittoor District
Police
  • Loading...

More Telugu News