Andhra Pradesh: గోదావరికి పెరిగిన వరద.. మునిగిపోయిన పోలవరం ‘కాఫర్ డ్యామ్’ అప్రోచ్ రోడ్డు!
- మహారాష్ట్రతో పాటు ఎగువన విస్తారంగా వర్షాలు
- 600 మీటర్ల మేర ప్రవహిస్తున్న గోదారమ్మ
- 200 మీటర్ల వెడల్పున్న ప్రాంతం నుంచి కిందకు వరదనీరు
మహారాష్ట్రతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉద్ధృతి పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 600 మీటర్ల వెడల్పు మేరకు గోదావరి ప్రవహిస్తోంది. దీంతో వరద ప్రవాహానికి కాఫర్ డ్యామ్ వరకూ వెళ్లేందుకు నిర్మించిన అప్రోచ్ రోడ్డు మునిగిపోయింది. కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి వెడల్పు 2400 మీటర్లు ఉండగా, ఇందులో 2200 మీటర్ల మేర కాఫర్ డ్యామ్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన 200 మీటర్ల ఖాళీ ప్రదేశం నుంచే గోదావరి వరద కిందకు వెళుతోంది.