Anupama Parameswaran: బుమ్రా నాకు స్నేహితుడు మాత్రమే.. డేటింగ్ వార్తలను ఖండించిన నటి అనుపమ పరమేశ్వరన్

  • అనుపమతో బుమ్రా డేటింగ్ అంటూ వార్తలు
  • అటువంటిదేమీ లేదన్న నటి
  • గతంలో రాశీ ఖన్నాతోనూ డేటింగ్ వార్తలు

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని, డేటింగ్ వార్తల్లో పసలేదని స్పష్టం చేసింది. క్రికెటర్లతో లింకులు పెట్టి వార్తలు సృష్టించడం మామూలేనని పేర్కొంది. కాగా, మరోనటి రాశీ ఖన్నాతోనూ బుమ్రాకు సంబంధాలు ఉన్నాయంటూ గతంలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలపై రాశీ అప్పుడే క్లారిటీ ఇచ్చింది. బుమ్రా ఎవరో తనకు వ్యక్తిగతంగా తెలియదని, తానెప్పుడూ అతడిని కలవలేదని తెలిపింది. బుమ్రా క్రికెటర్ అని మాత్రం తనకు తెలుసని పేర్కొంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడుతున్న బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 17 వికెట్లు తీసుకుని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Anupama Parameswaran
Jasprit Bumrah
Tollywood
Cricketer
  • Loading...

More Telugu News