Jammu And Kashmir: ప్రమాదవశాత్తు పేలిన తుపాకి.. కశ్మీర్‌లో ప్రకాశం జిల్లా సైనికుడి మృతి

  • గత నెలలో సెలవులపై స్వగ్రామానికి
  • ఈ నెల 3న తిరిగి విధుల్లో చేరిక
  • రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు

జమ్ముకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో విధులు నిర్వర్తిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన సైనికుడు తమ్మినేని అశోక్ కుమార్ (21) ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం అర్ధ రాత్రి విధుల్లో ఉన్న సమయంలో అతడి వద్ద ఉన్న తుపా‌కి ప్రమాదవశాత్తు పేలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని పాపినేనిపల్లి అశోక్ స్వస్థలం. సెలవులపై గత నెలలో ఇంటికి వచ్చిన అశోక్ ఈ నెల 3న తిరిగి వెళ్లి విధుల్లో చేరాడు. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం విషయం తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, అశోక్ మృతదేహానికి రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Jammu And Kashmir
Prakasam District
jawan
  • Loading...

More Telugu News