prathipati pulla rao: నేను బీజేపీలోకా? అదంతా వైసీపీ మైండ్‌గేమ్!: మాజీ మంత్రి ప్రత్తిపాటి

  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబే సీఎం
  • ఒక్క కార్యకర్త కూడా టీడీపీని వీడడం లేదు
  • ఎగిరిపడుతున్న వాళ్లకు జమిలి ఎన్నికలు సమాధానం చెబుతాయి

తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ప్రత్తిపాటి టీడీపీని వీడుతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో స్పందించిన ఆయన పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. తనకు అటువంటి ఆలోచన ఏదీ లేదన్నారు.

తాను మాత్రమే కాదని, అసలు టీడీపీ నుంచి ఒక్క కార్యకర్త కూడా బీజేపీలోకి వెళ్లడం లేదని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ఈ పుకార్లు అన్నీ వైసీపీ మైండ్ గేమ్‌లో భాగమేనన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఇప్పుడు ఎగిరి పడుతున్న అందరికీ రానున్న జమిలి ఎన్నికలే సమాధానం చెబుతాయని ప్రత్తిపాటి అన్నారు.

prathipati pulla rao
Andhra Pradesh
Telugudesam
BJP
YSRCP
  • Loading...

More Telugu News