cm: పరిపాలనలో జగన్ కంటే చంద్రబాబే వంద శాతం బెటర్: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

  • వైఎస్ కుమారుడు కనుకే జగన్ కు అవకాశమిచ్చారు
  • వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడం కష్టమే
  • మా కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విమర్శలు చేశారు. అదే సమయంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. పరిపాలనలో జగన్ కంటే చంద్రబాబే వంద శాతం బెటర్ అని అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు కనుకనే జగన్ కు ప్రజలు అవకాశమిచ్చారని, వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడం కష్టమేనని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి ఆయన మాట్లాడుతూ, తమ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 

cm
jagan
YSRCP
Chandrababu
kotla
Telugudesam
  • Loading...

More Telugu News