Nara Lokesh: నారా లోకేశ్ 'భావి సీఎం' అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం ఓ జోక్: వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

  • తన నియోజకవర్గంలోనే గెలవలేకపోయాడు
  • అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపిస్తాడా?
  • సరిగా మాట్లాడడమే రాదు

తన నియోజకవర్గంలో గెలవలేని వ్యక్తి, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపిస్తాడా? అంటూ నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేశ్ భావి సీఎం అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం ఓ జోక్ అంటూ కొట్టిపారేశారు. నారా లోకేశ్ ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని శ్రీదేవి సవాల్ విసిరారు. సరిగా మాట్లాడడమే రాని వ్యక్తి ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడో టీడీపీ నేతలే చెప్పాలని అన్నారు. ఇక, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఆమె విమర్శలు చేశారు. ఇచ్చిన మాటను గాలికొదిలేసే వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. హామీలు ఇవ్వడం, వాటిని గాలికొదిలేయడం చంద్రబాబు నైజం అని ఆరోపించారు. కానీ, సీఎం జగన్ అలా కాదని, ఓసారి మాట ఇస్తే మడమతిప్పని వ్యక్తి అని కొనియాడారు.

Nara Lokesh
Undavalli Sridevi
YSRCP
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News