Secretariat: సచివాలయాన్ని కూల్చొద్దు: కేసీఆర్ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు
- సచివాలయం, ఎర్రమంజిల్ లను కూల్చవద్దంటూ ఆదేశం
- తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ వ్యాఖ్య
- కౌంటర్ వేయడానికి గడువును కూడా తిరస్కరించిన న్యాయస్థానం
కేసీఆర్ సర్కారుకు ఈరోజు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాత సచివాలయాన్ని కూల్చి ఆ ప్రాంతంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని, ఎర్రమంజిల్ స్థానంలో అసెంబ్లీని నిర్మించాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చవద్దని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులను ఇచ్చేంత వరకు పాత నిర్మాణాల జోలికి పోవద్దని తెలిపింది. హైకోర్టులో ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కౌంటర్ వేయడానికి తమకు మరో 15 రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టును కోరారు. అయితే, ఆయన కోరికను తోసిపుచ్చిన కోర్టు... ఈరోజే వాదనలు వింటామని స్పష్టం చేసింది.