Andhra Pradesh: వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పిస్తున్నా!: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ

  • నేడు వైఎస్సార్ జయంతి
  • రైతు దినోత్సవంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • నివాళులు అర్పించిన టీఎంసీ అధినేత్రి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈరోజు ఏపీ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. ‘ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ట్యాగ్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 1948, జూలై 8న కడప జిల్లా జమ్మలమడుగులోని సీఎస్ఐ క్యాంప్ బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. 2009, సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళుతుండగా కర్నూలు జిల్లా రుద్రంకొండ(పావురాల గుట్ట) వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో ఆయన మరణించారు. 

Andhra Pradesh
Jagan
Chief Minister
West Bengal
mamata
birth anniversary
YSRCP
tmc
Twitter
tribute
  • Loading...

More Telugu News