Andhra Pradesh: నాపై ఒక్క ఆరోపణను నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటా!:మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సవాల్

  • నేను టీఆర్ఎస్ నుంచి రూ.100 కోట్లు తీసుకోలేదు
  • టీడీపీ నేతలు నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
  • మంగళగిరిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను టీఆర్ఎస్ నుంచి రూ.100 కోట్లు తీసుకున్నట్లు టీడీపీ చేస్తున్న ఆరోపణలను మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖండించారు. టీడీపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తాను లంచాలు తీసుకున్నట్లు, అవినీతికి పాల్పడినట్లు టీడీపీ నేతలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆర్కే సవాల్ విసిరారు. ‘చంద్రబాబు, లోకేశ్ లను నేను డైరెక్టుగా అడుగుతున్నా.. మీ ఇల్లు అక్రమమా? సక్రమమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఓ బీసీ మహిళ(పంచుమర్తి అనురాధ)ను  అడ్డు పెట్టుకుని ఆమెతో నాపై విమర్శలు చేయించడం పద్దతి కాదు. ధర్మం కాదు అని తెలియజేస్తున్నా’ అని చెప్పారు.

Andhra Pradesh
YSRCP
mangalagiri
alla ramakrishna reddy
Telugudesam
  • Loading...

More Telugu News