Shiva Krishna: సినీ స్వర్ణయుగంలో ఉన్నందుకు సంతోషపడతాను: నటుడు శివకృష్ణ

  • 'ముందడుగు' సినిమాతో స్టార్ డమ్ వచ్చింది
  •  ఎన్టీఆర్ గారు నేను ఆరాధించే దేవుడు 
  • నేను ఇష్టపడే నటి జయసుధ  

తెలుగు తెరపై విప్లవ కథా చిత్రాలలో ఎక్కువగా నటించిన నటుడిగా శివకృష్ణ కనిపిస్తారు. అప్పట్లోనే పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'మరో మలుపు' .. ఈ చరిత్ర ఏ సిరాతో' వంటి సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక నేను చేసింది హీరో పాత్రకాకపోయినా, నాకు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టిన సినిమా 'ముందడుగు' అనే చెప్పాలి.

నేను హీరోగా చేయడానికంటే, ఎన్టీఆర్ .. కృష్ణ .. శోభన్ బాబు గారు వంటి హీరోలతో కలిసి నటించడానికే ఎక్కువ ఆసక్తిని చూపించేవాడిని. ఎన్టీఆర్ గారి అభినయం అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆయనని నా దేవుడిగానే నేను భావిస్తాను. ఇక అప్పటి కథానాయికలలో జయసుధగారి నటన అంటే చాలా ఇష్టపడేవాడిని. తెలుగు చిత్రపరిశ్రమ స్వర్ణయుగం చూసినవారిలో నేనుండటం నాకు ఆనందాన్ని కలిగించే విషయం" అని చెప్పుకొచ్చారు. 

Shiva Krishna
  • Loading...

More Telugu News