Kevin Pietersen: ప్రపంచకప్ ఫైనల్లో ఆడే రెండు దేశాలు ఇవే: కెవిన్ పీటర్సన్ జోస్యం

  • సెమీస్ లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఓడిస్తుంది
  • న్యూజిలాండ్ ను ఇండియా ఇంటికి పంపుతుంది
  • ఇండియాను ఓడించే జట్టుదే ప్రపంచకప్

ఇంగ్లండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ చివరి అంకానికి చేరుకుంది. లీగ్ స్థాయిని దాటి నాకౌట్ దశకు చేరుకుంది. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో రేపు జరగనున్న తొలి సెమీస్ లో ఇండియా, న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. గురువారం ఎడ్జ్ బాస్టన్ లో జరగనున్న రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఢీకొంటుంది. ఈ నేపథ్యంలో, ఫైనల్స్ కు ఏయే జట్లు చేరబోతున్నాయో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ జోస్యం చెప్పాడు.

 సెకండ్ సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఓడిస్తుందని పీటర్సన్ చెప్పాడు. ఆదివారం లండన్ లో జరిగే ఫైనల్స్ లో ఇండియా, ఇంగ్లండ్ లు తలపడతాయని జోస్యం చెప్పాడు. ఇండియాను ఓడించే జట్టు ప్రపంచకప్ ను సొంతం చేసుకుంటుందని ట్వీట్ చేశాడు.  

Kevin Pietersen
England
India
World Cup
Finalists
  • Loading...

More Telugu News