Karnataka: కర్ణాటక సీఎంకు మరో షాక్.. మంత్రి పదవికి స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్ రాజీనామా!

  • గవర్నర్ వజూభాయ్ వాలాను కలసిన నగేశ్
  • మంత్రి పదవికి రాజీనామా లేఖ అందజేత
  • బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటన

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు కూటమికి బైబై చెప్పగా, తాజాగా కర్ణాటక మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్ తన మంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ కు వెళ్లిన నగేశ్, తన రాజీనామా లేఖను గవర్నర్ వజూభాయ్ వాలాకు అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కుమారస్వామి ప్రభుత్వానికి నా మద్దతును ఉపసంహరించుకుంటున్నా. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ బీజేపీని ఆహ్వానిస్తే నేను ఆ పార్టీకి మద్దతు ఇస్తా’ అని తెలిపారు.  మరోవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తమ మంత్రి పదవులను తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Karnataka
Congress
jds
nagesh resign
independent mla
  • Loading...

More Telugu News