Ram Madhav: తానా మహాసభల్లో రాంమాధవ్ ప్రసంగానికి అడ్డుతగిలిన ప్రవాసాంధ్రులు.. వీడియో చూడండి

  • మోదీని పొగుడుతూ రాంమాధవ్ ప్రసంగం
  • కేకలు వేస్తూ గందగోళం సృష్టించిన వైనం
  • వేదిక నుంచి దిగిపోవాలంటూ నినాదాలు

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తానా మహాసభలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సభలకు అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా గౌరవ అతిథిగా హాజరయ్యారు. అయితే, ఊహించని విధంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

తానా మహాసభల్లో రాంమాధవ్ ప్రసంగిస్తూ, ఇరు రాష్ట్రాల తెలుగువారంతా ఐకమత్యంగా ఉండి, అభివృద్ధి బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రతిష్టను ప్రధాని మోదీ పెంచారని, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని... అందుకే దేశ ప్రజలంతా ఆయనకు మరోసారి పట్టం కట్టారని చెప్పారు. తన ప్రసంగాన్ని రాంమాధవ్ కొనసాగిస్తుండగా... ప్రవాసాంధ్రులు అడ్డుతగిలారు. ఈలలు, కేకలు వేస్తూ గందరగోళం సృష్టించారు. వేదిక నుంచి దిగిపోవాలని నినాదాలు చేశారు. దీంతో, రాంమాధవ్ నిశ్చేష్టులయ్యారు. తన ప్రసంగాన్ని తొందరగా ముగించేశారు.

  • Loading...

More Telugu News