Road Accident: కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

  • విజయవాడలో చదువుతున్న కుమార్తెను చూసి వస్తుండగా ఘటన
  • మృతులు కొత్తగూడెం వాసులు
  • తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తగూడేనికి చెందిన ఓ కుటుంబం విజయవాడలో చదువుతున్న తమ కుమార్తెను చూసేందుకు కారులో బయలుదేరారు. తిరిగి వస్తుండగా కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం పెనగడపల వద్దకు రాగానే వీరి కారును టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రమేశ్ (41), సుజాత (39), ప్రశాంతి (31)లు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident
Khammam District
Bhadradri Kothagudem District
Vijayawada
  • Loading...

More Telugu News