Guntur District: నరసరావుపేట మండలంలో లక్షల విలువ చేసే సోలార్ పంపుసెట్లు ధ్వంసం

  • గోనెపూడి శివారు ప్రాంతంలో దుండగుల దుశ్చర్య
  • 2 సోలార్ పంపుసెట్ల ధ్వంసం
  • రూ.50 వేల విలువైన మోటార్ బావిలో పడేసిన దుండగులు

రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా సోలార్ ప్యానెళ్లు, సోలార్ పంపుసెట్లు ధ్వంసం చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం గోనెపూడి వద్ద దుండగులు సోలార్ పంపుసెట్లను ధ్వంసం చేశారు. గోనెపూడి శివారు ప్రాంతంలోని వ్యవసాయభూముల్లో ఉన్న 2 సోలార్ పంపుసెట్లపై తమ ప్రతాపం చూపించారు. వీటి విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంతేగాకుండా, రూ.50 వేల విలువైన మోటార్ ను బావిలో పడేశారు. దీనిపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Guntur District
Solar
Narasaraopet
  • Loading...

More Telugu News