Telangana: కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • సచివాలయం కూల్చివేత, అసెంబ్లీ నిర్మాణంపై ముగిసిన రౌండ్ టేబుల్ సమావేశం
  • కొత్త నిర్మాణాలకు మేము వ్యతిరేకం
  • ప్రస్తుత భవనాలు చాలా కాలం వినియోగించుకోవచ్చు

తెలంగాణలో అసెంబ్లీ, సెక్రటేరియట్ కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని టీ-కాంగ్రెస్ ఎంపీ, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో సచివాలయం కూల్చివేత, అసెంబ్లీ నిర్మాణాలపై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ, సెక్రటేరియట్ కొత్త నిర్మాణాలకు తాము వ్యతిరేకమని, వాటిని కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న భవనాలు చాలాకాలం వినియోగించుకోవచ్చని సూచించారు. తెలంగాణలో ప్రస్తుత అసెంబ్లీ.. పార్లమెంట్ భవనం కన్నా ‘ఇది బాగుంటుంది’ అని అన్నారు. విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు అనడం ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అసెంబ్లీ, సెక్రటేరియట్  నిర్మాణాల అంశంపై లోక్ సభలో ప్రస్తావిస్తానని అన్నారు. 

Telangana
cm
kcr
congress
Uttam kumar
  • Loading...

More Telugu News