Pawan Kalyan: పాత పరిచయంతోనే రామ్ మాధవ్ ను కలిశాను: పవన్ కల్యాణ్

  • ఇందులో ఆపరేషన్ ఆకర్ష్ లేదు
  • బీజేపీతో వ్యక్తిగత వైరంలేదు
  • ప్రత్యేకహోదా కోసమే బీజేపీని ప్రశ్నించా

అమెరికాలో తానా ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి తానా వేడుకల్లో అతిథిగా జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తో సమావేశమయ్యారు. అమెరికాలో జరిగిన వీరి భేటీ అందరిలోనూ ఆసక్తి కలిగించింది. అయితే, పవన్ కల్యాణ్ దీనిపై వివరణ ఇచ్చారు. పాత పరిచయంతోనే రామ్ మాధవ్ ను కలిశానని వెల్లడించారు. తాను రామ్ మాధవ్ ను కలవడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ లాంటివేమీ లేవని స్పష్టం చేశారు. బీజేపీతో తనకు వ్యక్తిగత విభేదాలేవీ లేవని, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో బీజేపీని ప్రశ్నించానని తెలిపారు. కాగా, ఇరువురు నేతల మధ్య నెలరోజుల జగన్ పాలన ప్రముఖంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ పాలన తీరుపై అభిప్రాయాలు పంచుకున్నట్టు సమాచారం.

Pawan Kalyan
Jana Sena
BJP
Ram Madhav
  • Loading...

More Telugu News