Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో పనిచేసే ఉద్దేశంలేదు, కానీ ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తాం: రామ్ మాధవ్

  • తానా వేడుకల సందర్భంగా పవన్, రామ్ మాధవ్ భేటీ
  • ఇరువురి మధ్య చర్చలు
  • స్నేహపూర్వకంగానే కలిశామన్న రామ్ మాధవ్

అమెరికాలో తానా వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయనేతలు మంతనాలు జరిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ నేత రామ్ మాధవ్ తానా వేడుకల సందర్భంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం రామ్ మాధవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో పనిచేసే ఉద్దేశం లేదని, అయితే పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ ను స్నేహపూర్వకంగానే కలిశానని, తమ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన రాజకీయశక్తిగా ఎదగడమే ప్రస్తుతం బీజేపీ ముందున్న లక్ష్యం అని వెల్లడించారు.

Pawan Kalyan
Jana Sena
BJP
Ram Madhav
  • Loading...

More Telugu News