Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పులేదు: మాజీ సీఎం సిద్ధరామయ్య

  • కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై స్పందన
  • ఇది ఆపరేషన్ ‘కమలం’లో భాగమే
  • సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుంది

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందించారు. పార్టీ ఫిరాయింపుల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ‘ఇది ’ఆపరేషన్ కమలం’లో భాగమే. మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పులేదు’ అని, కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కు చెందిన మరో నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, కర్ణాటకలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ కుట్ర పన్నుతోందని, తమ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న బీజేపీ యత్నాలు ఫలించవని ధీమా వ్యక్తం చేశారు.

Karnataka
Ex cm
Siddha Ramaiah
Mallikarjuna
  • Loading...

More Telugu News