Krishna District: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడే నాకు ఆదర్శం : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

  • ఆయన స్ఫూర్తితోనే శిక్షణ కేంద్రం ఏర్పాటు
  • స్వర్ణభారత్ ట్రస్ట్‌లో వేలాది మందికి శిక్షణ
  • ట్రస్ట్‌ నాయుడుగారి శ్వాస, ధ్యాస

వేలాది మందికి శిక్షణ అందజేసే స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శ్వాస, ధ్యాస అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను ఓ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో నిర్వహించిన ప్రతిభ పురస్కారం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణబారత్‌ ట్రస్ట్‌ వేలాది మంది యువత, రైతులకు సేవలందిస్తోందని గుర్తు చేశారు. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దగ్గర చేసిన ఘనత ట్రస్ట్‌కు దక్కుతుందన్నారు. వెంకయ్యనాయుడు నిత్యం ట్రస్ట్‌ గురించే ఆలోచిస్తారంటే దాని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ స్ఫూర్తితోనే తాను 2004లో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.

Krishna District
atkuru
swarnabharathi trust
kishanreddy
Venkaiah Naidu
  • Loading...

More Telugu News