Telugudesam: చంద్రబాబు కార్యక్రమానికి మాజీ మంత్రి ప్రత్తిపాటి దూరం.. క్లారిటీ ఇచ్చిన జిల్లా ఉపాధ్యక్షుడు

  • అందుబాటులో లేని కారణంగానే చంద్రబాబు కార్యక్రమానికి హాజరు కాలేదు
  • టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో వీడను
  • కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు

టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమానికి ఆయన హాజరుకాలేదు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు షేక్ కరీముల్లా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. అందుబాటులో లేని కారణంగానే చంద్రబాబు కార్యక్రమానికి ప్రత్తిపాటి హాజరు కాలేకపోయారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సాకుగా తీసుకుని కొందరు దుష్ప్రచారానికి తెరతీశారని ఆయన మండిపడ్డారు. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో ప్రత్తిపాటి వీడరని చెప్పారు. రానున్న రోజుల్లో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. వైసీపీ దాడులను తిప్పికొట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

Telugudesam
Chandrababu
Prathipati Pulla Rao
BJP
YSRCP
Chilakaluripeta
  • Loading...

More Telugu News