Boddu Bhaskar Rao: వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

  • వైసీపీలో చేరనున్న బొడ్డు భాస్కరరావు
  • ఇప్పటికే సన్నిహితులు, అనుచరులతో మంతనాలు
  • రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం

తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా ఇతర పార్టీల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీ మారిన సంగతి తెలిసిందే. తాజాగా, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరావు కూడా పార్టీకి టాటా చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన తన అనుచరులు, కార్యకర్తలు, అత్యంత సన్నిహితులతో మంతనాలు జరిపారు. వైసీపీలో చేరికపై ఆయన రేపు అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం టికెట్ ను ఆయన ఆశించారు. అయితే, తనకు హైకమాండ్ టికెట్ ను నిరాకరించడంతో అప్పుడే పార్టీకి గుడ్ బై చెప్పాలని ఆయన భావించారు.

Boddu Bhaskar Rao
Telugudesam
YSRCP
Peddapuram
  • Loading...

More Telugu News