Jagan: జగన్ నివాసం వద్ద డీఎస్సీ అభ్యర్థుల నిరసన

  • నిరసన చేపట్టిన డీఎస్సీ 2008 అభ్యర్థులు
  • పదేళ్లుగా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన
  • ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద డీఎస్సీ 2008 అభ్యర్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తాడేపల్లిలోని నివాసం వద్దకు చేరుకున్న వీరు డీఎస్సీలో నష్టపోయిన 4,657 మంది కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. గత పదేళ్లుగా తమ సమస్యలపై పోరాడుతున్నామని... అయినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఆర్థికశాఖలో నిలిచిపోయిన జీవోను ఇప్పటికైనా విడుదల చేసి, తమను ఆదుకోవాలని కోరారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, వీరి ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Jagan
YSRCP
DSC
Protest
  • Loading...

More Telugu News