Telugudesam: హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్న చంద్రబాబు

  • 9వ తేదీన విజయవాడ నుంచి కడపకు విమానంలో వెళ్లనున్న చంద్రబాబు
  • అక్కడి నుంచి తాడిపత్రికి రోడ్డు మార్గంలో పయనం
  • హత్యకు గురైన వ్యక్తి కుటుంబీకులను కలవనున్న మాజీ సీఎం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. దాడులకు గురైన వ్యక్తులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శిస్తున్నారు. తాడిపత్రిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు ఈనెల 9న ఆయన విజయవాడ నుంచి విమానంలో కడప ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడిపత్రికి బయల్దేరుతారు. హత్యకు గురైన వ్యక్తి కుటుంబీకులను పరామర్శించి, వారికి భరోసా కల్పించనున్నారు.

Telugudesam
Chandrababu
Tadipatri
Murder
  • Loading...

More Telugu News