Virat Kohli: టీమిండియా సారథి కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

  • ప్రపంచకప్‌లో కోహ్లీ వెయ్యి పరుగులు
  • సచిన్, గంగూలీ సరసన టీమిండియా సారథి
  • శ్రీలంకతో మ్యాచ్‌లో ఘనత

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ.. ప్రపంచకప్‌లో వెయ్యి పరుగులు సాధించిన మూడో ఇండియన్‌గా చరిత్రకెక్కాడు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో ఐదు పరుగులు సాధించిన వెంటనే కోహ్లీ ఖాతాలో వెయ్యి పరుగులు చేరాయి. ప్రపంచకప్‌లో సచిన్ 2,278 పరుగులు చేయగా, గంగూలీ 1,006 పరుగులు చేశాడు. ఇప్పుడు వీరి సరసన కోహ్లీ చేరాడు.

Virat Kohli
Sachin Tendulkar
sourav ganguly
world cup
  • Loading...

More Telugu News