Pawan Kalyan: అమెరికాలో బీజేపీ అగ్రనేతతో చర్చలు జరిపిన పవన్ కల్యాణ్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-a8a528ee05b6268bc16dc1402da92912ded0913c.jpg)
- తానా మహాసభలకు హాజరైన పవన్, రాంమాధవ్
- ఏపీ రాజకీయాలపై చర్చించిన నేతలు
- తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. తానా మహాసభలకు పవన్, రాంమాధవ్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై పవన్, రాంమాధవ్ లోతుగా చర్చలు జరిపారు. వీరి భేటీపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.