Toll Gate: టోల్ సిబ్బందిపై బీజేపీ ఎంపీ బాడీగార్డుల దాడి.. పోలీసులకు ఫిర్యాదు

  • ఢిల్లీ నుంచి ఆగ్రాకు బయల్దేరిన రామ్ శంకర్
  • క్యూలైన్‌లో రావాలని డ్రైవర్లను కోరిన టోల్ సిబ్బంది
  • టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన బాడీగార్డులు

టోల్‌గేట్ సిబ్బందిపై బీజేపీ ఎంపీ  ఒకరు తమ ప్రతాపాన్ని చూపించారు. క్యూలైన్‌లో రమ్మనడమే టోల్ సిబ్బంది చేసిన తప్పు. దీంతో వారిపై ఎంపీ బాడీ గార్డులు దాడికి పాల్పడ్డారు. టోల్ గేట్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ ఎంపీ, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్ శంకర్ కేథరియా నేటి తెల్లవారుజామున ఢిల్లీ నుంచి ఆగ్రాకు బయల్దేరారు.

ఉదయం 3 గంటల సమయంలో రెహాన్ కాలా వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్దకు రాగానే అక్కడి సిబ్బంది ఆయన వాహనాన్ని ఆపి క్యూలైన్లో రావాలని ఎంపీ డ్రైవర్లను కోరారు. దీంతో రామ్ శంకర్ బాడీ గార్డులు టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో టోల్ సిబ్బంది ఎంపీ, ఆయన బాడీ గార్డులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టోల్ సిబ్బందిపై ఎంపీ బాడీ గార్డుల దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Toll Gate
Ram Shankar Ketheria
Body Guards
Delhi-Agra
Social Media
  • Loading...

More Telugu News