Nadendla Bhaskar Rao: అప్పుడే మోదీ ఆహ్వానించారు కానీ నా కుమారుడు స్పీకర్‌గా ఉండటంతో తిరస్కరించా: నాదెండ్ల

  • ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తా
  • పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధం
  • నా కుమారుడి రాజకీయ జీవితం అతని వ్యక్తిగతం

బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పేర్కొన్నారు. నేడు కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్న అనంతరం ఓ ఛానల్‌తో మాట్లాడుతూ, పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్నారు.

తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని నాదెండ్ల తెలిపారు. తన కుమారుడి రాజకీయ జీవితం అతని వ్యక్తిగమని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు అతనికి ఉందని అన్నారు. కాంగ్రెస్ ఇక మీదట కోలుకోవడం కష్టమన్నారు. తనను మోదీ 2014లోనే బీజేపీలోకి ఆహ్వానించారని, కానీ తన కుమారుడు స్పీకర్ పదవిలో ఉన్నందున తాను తిరస్కరించాల్సి వచ్చిందని నాదెండ్ల స్పష్టం చేశారు.

Nadendla Bhaskar Rao
Andhra Pradesh
Amith Shah
Narendra Modi
BJP
Speaker
  • Loading...

More Telugu News