Kalyan Ram: కల్యాణ్ రామ్ హీరోగా 'ఎంత మంచివాడవురా'

  • వరుస సినిమాలతో బిజీగా కల్యాణ్ రామ్
  • సతీశ్ వేగేశ్నతో ఫ్యామిలీ ఎంటర్టైనర్
  • త్వరలోనే పూర్తి వివరాలు

హీరోగా కల్యాణ్ రామ్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. కథాకథనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధపెడుతూ దర్శకులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు వున్నాయి. వేణు మల్లిడి దర్శకత్వంలో .. విరించివర్మ దర్శకత్వంలో ఆయన ప్రాజెక్టులు వున్నాయి.

ఇక సతీశ్ వేగేశ్నతోను ఆయన ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆదిత్య మ్యూజిక్ వారు, శివలెంక కృష్ణప్రసాద్ తో కలిసి ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించనున్నారు. కథానాయకుడిగా కల్యాణ్ రామ్ ఎంపిక జరిగిపోయింది. తాజాగా ఈ సినిమాకి 'ఎంత మంచివాడవురా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 'శతమానం భవతి' .. 'శ్రీనివాస కల్యాణం' అనే సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్రవేసిన సతీశ్ వేగేశ్న నుంచి రానున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నారు. 

Kalyan Ram
  • Loading...

More Telugu News