Babul supriyo: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను కోతితో పోల్చిన ‘తృణమూల్’ నేత!

  • బాబుల్ సుప్రియో, జితేంద్ర తివారీల మాటల యుద్ధం
  • ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటున్న వైనం
  • ఇలాంటి కోతుల ఆట కట్టిస్తాం: తివారీ

కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత జితేంద్ర తివారీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు నేతలు పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాజాగా, బాబుల్ సుప్రియోను కోతితో పోల్చిన జితేంద్ర తివారి, ఇలాంటి కోతుల ఆట కట్టిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్ కతాలోని అసన్ సోల్ నగరంలో రథయాత్ర ఉత్సవ కమిటీలకు ఇరవై ఐదు వేల చొప్పున ఇవ్వాలని తివారీ ఇటీవల నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని బాబుల్ సుప్రియో తప్పుబడుతూ, జితేంద్ర తివారీపై విమర్శలు చేశారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బును తిరిగి వారికే ఇస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ జితేంద్ర తివారీ, బాబుల్ సుప్రియోను కోతితో పోల్చారు. 

Babul supriyo
BJP
Trinamul congress
J.Tiwari
  • Loading...

More Telugu News