Director: సినీ దర్శకుడు ధవళ సత్యంకు మాతృవియోగం

  • ధవళ సత్యం తల్లి సరస్వతి (86) కన్నుమూత
  • నర్సాపూర్ లో ఈరోజు మృతి 
  • అంత్యక్రియలు నర్సాపూర్ లో నిర్వహిస్తామన్న సత్యం 

అభ్యుదయ కథా చిత్రాల దర్శకుడు ధవళ సత్యం తల్లి సరస్వతి (86) కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ లో ఈ రోజు ఆమె మృతి చెందినట్టు ధవళ సత్యం తెలిపారు. తన తల్లి అంత్యక్రియలు నర్సాపూర్ లో నిర్వహిస్తామని చెప్పారు. సరస్వతి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, సరస్వతి పెద్దకుమారుడు ధవళ సత్యం. ఇద్దరు కుమారులు ధవళ చిన్నారావు, ధవళ మల్లిక్ లు చిత్ర పరిశ్రమలోనే స్థిరపడ్డారు. మరో కుమారుడు లక్ష్మీ నరసింహారావు నర్సాపూర్ కాలేజ్ లో ‘తెలుగు’ విభాగంలో పనిచేస్తున్నారు.  

Director
Dhawala Satyam
mother
Demise
  • Loading...

More Telugu News