Kodela: కోడెల కుటుంబంపై మరో కేసు.. 13కి చేరిన కేసుల సంఖ్య

  • ఎన్నికల్లో ఓటమి అనంతరం కోడెల కుటుంబంపై ఫిర్యాదుల వెల్లువ
  • సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో అత్యధిక కేసులు
  • తాజాగా ఓ కాంట్రాక్టర్ ఫిర్యాదు

టీడీపీ ఓటమి అనంతరం ఏపీలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యులపై నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కోడెల కుటుంబంపై మరో కేసు నమోదైంది. కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాంపై రొంపిచెర్ల మండలం వడ్లమూడివారిపాలెం వాసి శివరామయ్య ఫిర్యాదు చేశారు. ఓ కాంట్రాక్ట్ విషయంలో తన నుంచి 7 లక్షల రూపాయలు తీసుకుని, దీనిపై ప్రశ్నిస్తే తనను బెదిరిస్తున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుతో ఇప్పటివరకు కోడెల కుటుంబంపై నమోదైన కేసుల సంఖ్య 13కి చేరింది.

Kodela
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News