Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెంచిన ఐఆర్ పై ఉత్తర్వులు జారీ!

  • మధ్యంతర భృతి 27 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయం
  • ఈ జూలై నుంచే వర్తింపు
  • తొలి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) పెంచుతూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయంతో సుమారు 4 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. అయితే, రూ.815 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు భారం పడనుంది. జగన్ సీఎం అయ్యాక తొలి క్యాబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 27 శాతం మేర మధ్యంతర భృతి పెంపుదల చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ పెంపు ఈ జూలై మాసం నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది.

  • Loading...

More Telugu News