Vijayawada: బాబూ జగ్జీవన్ రామ్ కు నిజమైన వారసుడు జగన్: ఏపీ మంత్రి వెల్లంపల్లి

  • జగన్ బాటలో నడిచే వాళ్లందరూ ఆ మహనీయులకు వారసులే
  • ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసింది మేమే 
  • బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి కార్యక్రమంలో వెల్లంపల్లి

అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ కు నిజమైన వారసుడు ఏపీ సీఎం జగన్ అని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని  పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 32వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి వెల్లంపల్లి శ్రీనివాస్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, జగన్ బాటలో నడిచే అందరూ ఆ మహనీయులకు వారసులే అని అన్నారు. ఆ మహనీయుల మాటలను ఆచరించి వారి ఆశయ సాధనకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపు నిచ్చారు. దేశ చరిత్ర లోనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం తమదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేసిందని, అందుకు నిదర్శనం గానే ప్రభుత్వ కూర్పులో వారికి స్థానం కల్పించామని గుర్తుచేశారు. 

Vijayawada
cm
jagan
minister
Vellampalli
  • Loading...

More Telugu News