YSR: రాజన్న బడిబాట సైకిళ్లపై సరికొత్త లోగో... ముగ్గురి ముఖాలతో డిజైన్!

  • వైఎస్సార్ జయంతి సందర్భంగా విద్యార్థినులకు సైకిళ్లు
  • జూలై 8న అన్ని నియోజకవర్గాల్లో సైకిళ్ల పంపిణీ
  • సైకిల్ ముందు ఉండే బుట్టపై లోగో ఏర్పాటు

ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు సర్కారు సైకిళ్లు పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈసారి జగన్ సీఎం అయిన నేపథ్యంలో రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా నూతన సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. దివంగత వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని జూలై 8న అన్ని నియోజకవర్గాల్లో సైకిళ్లు అందజేయనున్నారు. బాలికలకు అందజేస్తున్న ఈ సైకిళ్లపై కొత్త లోగో దర్శనమివ్వనుంది. దివంగత వైఎస్సార్, సీఎం జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ల ముఖచిత్రాలతో కూడిన సరికొత్త లోగోను సైకిల్ కు ముందు ఉండే బుట్టపై ఏర్పాటు చేయనున్నారు.

YSR
Jagan
YSRCP
Adimulapu Suresh
Andhra Pradesh
Bicycles
Girls
  • Loading...

More Telugu News