Nara Lokesh: నారా లోకేశ్‌పై ఎన్ఆర్ఐ ప్రభాకరరెడ్డి అసభ్య పోస్టింగ్.. పోలీసులకు ఫిర్యాదు!

  • లోకేశ్‌పై అసభ్య వ్యాఖ్యలు, ఫొటోలు
  • తాడేపల్లి పోలీసులకు వర్ల రామయ్య ఫిర్యాదు
  • నిందితుడు న్యూజెర్సీలో ఉంటున్న ప్రభాకరరెడ్డిగా గుర్తింపు

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఎన్ఆర్ఐ ప్రభాకరరెడ్డి అసభ్య కామెంట్లు చేశారు. లోకేశ్ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యలు, ఫొటోలను పోస్టు చేసిన ప్రభాకరరెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న ఈ పోస్టులను గుర్తించామని, ఆరా తీస్తే అతడు వైసీపీ సానుభూతిపరుడని, న్యూజెర్సీలో ఉంటాడని తేలిందని తాడేపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వర్ల రామయ్య పేర్కొన్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఫొటోల సీడీని రామయ్య పోలీసులకు అందించారు.  

Nara Lokesh
varla ramaiah
Telugudesam
Social Media
  • Loading...

More Telugu News