Buggana Rajendranath: ఏపీకి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం బాధాకరం: బుగ్గన

  • రాజధాని, రెవెన్యూ లోటు ప్రస్తావనే లేదు
  • హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరం
  • వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఊసే లేదు

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో ఏపీ నేతలు పెదవి విరుస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందిస్తూ, సంతృప్తికరంగా లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై పడుతుందని ఆయన పేర్కొన్నారు. హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు.

వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీపై సైతం ప్రస్తావించలేదని బుగ్గన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు. అలాగే రాజధాని, రెవెన్యూ లోటు ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సాయం సంగతి ఎలా ఉన్నా, నవరత్నాలు, హామీల అమలు విషయంలో రాజీ పడేది లేదని బుగ్గన స్పష్టం చేశారు.

Buggana Rajendranath
Andhra Pradesh
Central Budget
Special Status
  • Loading...

More Telugu News