Narendra Modi: సభ్యత్వ నమోదును వారణాసిలో ప్రారంభించనున్న మోదీ.. హైదరాబాద్‌లో అమిత్ షా

  • తెలంగాణపై మరింత దృష్టి సారించనున్న బీజేపీ
  • శంషాబాద్‌లో ప్రారంభించనున్న అమిత్ షా
  • మేధావులను భాగస్వాములను చేయాలని ఆదేశాలు

తమ పార్టీని మరింత బలోపేతం చేయడానికి బీజేపీ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా రేపటి నుంచి దేశ వ్యాప్త సభ్యత్వ నమోదును ప్రారంభించనుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ మరింత దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.

రేపు స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంషాబాద్‌లో సభ్యత్వ నమోదును ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులను, కుల పెద్దలను సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేయాలని అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Narendra Modi
Amth shah
BJP
Telangana
Shamshabad
Varanasi
  • Loading...

More Telugu News