Allu Arjun: అల్లు అర్జున్ కొనుగోలు చేసిన 'కదిలే ఇంద్రభవనం' ప్రత్యేకతలు ఇవే!

  • రూ.7 కోట్లతో ఫాల్కన్ కారవాన్ కొనుగోలు చేసిన బన్నీ
  • ఇంటీరియర్ కోసమే రూ.3.5 కోట్లు ఖర్చుచేసిన వైనం
  • అడుగడుగునా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పనితనం!

సినీతారలు షూటింగ్ లో ఎంతో అలసిపోతుంటారు. అందుకే తమ లగ్జరీ కోసం ఖరీదైన కారవాన్ లను కూడా సెట్స్ వద్దకు తెచ్చుకుంటారు. ఇప్పటి అగ్ర హీరోలు, హీరోయిన్లలో దాదాపు చాలామందికి సొంత కారవాన్ లు ఉన్నాయి. తాజాగా, టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కళ్లు చెదిరే ధరకు ఓ విలాసవంతమైన కారవాన్ ను సొంతం చేసుకున్నాడు. ఫాల్కన్ బ్రాండ్ నేమ్ తో తయారైన ఈ కదిలే ఇంటిని బన్నీ ఇటీవలే ఏరికోరి డిజైన్ చేయించుకున్నారు. దీని ఖరీదు రూ.7 కోట్లు అని తెలుస్తోంది.

ఫుల్ బ్లాక్ కలర్ లో ఉన్న ఈ కారవాన్ ప్రత్యేకతల విషయానికొస్తే, ఓ డీలక్స్ సూట్ లో ఉండే ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అడుగడుగునా రిచ్ నెస్ ఉట్టిపడేలా ఇంటీరియర్స్, వరల్డ్ క్లాస్ మెటీరియల్ తో తయారైన ఫర్నీచర్, లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అన్నీ ఈ స్టయిలిష్ కారవాన్ లో అందంగా కొలువుదీరాయి. ముంబయికి చెందిన ఓ ప్రముఖ కారవాన్ డిజైనింగ్ సంస్థ చేతిలో రూపుదిద్దుకున్న ఈ కారవాన్ లో బన్నీ ఇంటీరియర్ ఏర్పాట్ల కోసమే మూడున్నర కోట్లు ఖర్చుచేశాడట.  

ఈ కారవాన్ పై అల్లు అర్జున్ పేరులోని AA  అనే అక్షరాలను లోగో రూపంలో సుందరంగా డిజైన్ చేశారు. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న రూఫ్ టాప్, రిక్లెయినర్ సీటింగ్, కిచన్, వాష్ రూమ్, కింగ్ సైజ్ బెడ్, అత్యాధునిక లైటింగ్ తో ఫాల్కన్ నడిచే ఇంద్రభవనంలా అనిపిస్తుందనడం అతిశయోక్తి కాదు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News