Kanna babu: వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించనున్నాం: ఏపీ మంత్రి కన్నబాబు

  • రైతు దినోత్సవంలో పాల్గొననున్న జగన్
  • అరటి పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన
  • రాష్ట్ర వ్యాప్తంగా విత్తన కొరత లేకుండా చూస్తాం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించనున్నట్టు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ నెల 8న వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని తమ తమ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రైతు దినోత్సవం నిర్వహిస్తారని వెల్లడించారు.

ఈ సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని తెలిపారు. అలాగే పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రానికి జగన్ శంకుస్థాపన చేస్తారన్నారు. ఉత్తరాంధ్రలో సరిపడా వేరుశనగ విత్తనాలను సరఫరా చేశామని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొరత లేకుండా చూస్తామన్నారు. ఇప్పటికే మొత్తం 3.13 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సరఫరా చేసినట్టు కన్నబాబు స్పష్టం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News