Gopal Bhandari: కర్ణాటక మాజీ ఎమ్మెల్యే బస్సులో ప్రయాణిస్తూ హఠాన్మరణం

  • 1999, 2008లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం
  • బెంగుళూరు నుంచి మంగుళూరుకు ప్రయాణం
  • బస్సు మంగుళూరు చేరుకున్నా లేవని భండారీ

ఉడుపి మాజీ ఎమ్మెల్యే, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత బస్సులో గుండెపోటుతో మృతి చెందడం విషాదాన్ని నింపింది. 1999, 2008లో ఉడిపి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గోపాల్ భండారి(66) నేడు కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. అత్యంత సాధారణ జీవితం గడిపే ఆయన నేడు బస్సులో బెంగుళూరు నుంచి మంగుళూరుకు ప్రయాణించారు.

అయితే మంగుళూరు బస్సు చేరుకున్నప్పటికీ ఎంతకీ భండారీ లేవకపోవడంతో డ్రైవర్ దగ్గరికెళ్లి గమనించాడు. అయితే అప్పటికే భండారీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే భండారీ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.  

Gopal Bhandari
Bangulore
Magulore
KSRTC
Karnataka
  • Loading...

More Telugu News