Nalini: రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్షను అనుభవిస్తున్న నళినికి పెరోల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు

  • కుమార్తె వివాహానికి వెళ్లేందుకు అనుమతి
  • 30 రోజుల పెరోల్ మంజూరు చేసిన కోర్టు
  • లండన్ లో నివసిస్తున్న నళిని కుమార్తె

మాజీ ప్రధాని రాజీవ్ హత్యకేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న నళిని కల నెరవేరింది. తన కుమార్తె వివాహాన్ని కళ్లారా చూడాలనుకున్న ఆమె ఆకాంక్ష తీరనుంది. కూతురు వివాహానికి వెళ్లేందుకు నళినికి మద్రాస్ హైకోర్టు 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. నళిని కుమార్తె లండన్ లో నివసిస్తున్నారు. కుమార్తె పెళ్లి పనులను చూసుకునే నిమిత్తం తనకు పెరోల్ మంజూరు చేయాలన్న నళిని విన్నపం పట్ల మానవతా దృక్పథంతో పెరోల్ ఇచ్చింది.  

ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ సభ్యులైన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎం నిర్మల్ కుమార్ లు ఆమెకు కొన్ని షరతులు విధించారు. పెరోల్ పై బయట ఉన్న సమయంలో రాజకీయ నాయకులను కలవడం కానీ, ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చేయకూడదని ఆదేశించారు. నళిని విడుదలకు 10 రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.  

తమిళనాడులోని శ్రీపెరుంబదూర్ లో బహిరంగసభలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఎల్టీటీఈ ఆత్మాహుతి దళం దాడి చేసింది. 1991 మే 21న జరిగిన ఈ దాడిలో రాజీవ్ శరీరం ఛిద్రమైంది. ఆయనతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నళినితో పాటు మరో ఆరుగురు వేలూరు సెంట్రల్ జైల్లో జీవితఖైదును అనుభవిస్తున్నారు.

  • Loading...

More Telugu News