Mallannasagar: ‘మల్లన్నసాగర్’ భూముల వ్యవహారంలో ముగ్గురు అధికారులకు జైలు శిక్ష

  • హైకోర్టుకు తప్పుడు సమాచారం 
  • సిద్దిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్, ఎస్ఈ లకు జైలు, జరిమానా 
  • రూ.2 వేల జరిమానా, 3 నెలల జైలు శిక్ష విధింపు

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. మల్లన్న సాగర్ భూముల వ్యవహారం కేసులో ముగ్గురు అధికారులకు జైలు శిక్ష, జరిమాన విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. మల్లన్న సాగర్ భూముల వ్యవహారానికి సంబంధించి హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని భావించిన న్యాయస్థానం, సిద్దిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్ కు మూడు నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. ఇదే వ్యవహారంలో మల్లన్న సాగర్ ఎస్ఈకి కూడా ఇదే శిక్ష, జరిమానాను విధించింది.

Mallannasagar
Telangana
High Court
SE
MRO
  • Loading...

More Telugu News