Guntur District: ఇంతకీ ఆ గెస్ట్ హౌస్ ఎవరిదో చంద్రబాబే చెప్పాలి?: ఎంపీ విజయసాయిరెడ్డి

  • లింగమనేని గెస్ట్ హౌస్ ను ల్యాండ్ పూలింగ్ లో సేకరించారు
  • ప్రభుత్వ గెస్ట్ హౌస్ గా మార్చినట్టు 2016లో చంద్రబాబు ప్రకటించారు
  • గెస్ట్ హౌస్ మరమ్మతులకు రూ.8 కోట్లు ఖర్చు పెట్టారు

ఉండవల్లిలోని కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు విమర్శలు చేశారు. కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను ల్యాండ్ పూలింగ్ లో సేకరించారని, దీన్ని ప్రభుత్వ గెస్ట్ హౌస్ గా మార్చినట్టు మార్చి 6, 2016లో చంద్రబాబు ప్రకటించారని అన్నారు. రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ లింగమనేని పేరుతోనే ఉందని విమర్శించారు. గెస్ట్ హౌస్ మరమ్మతుల కోసం రూ.8 కోట్లు ఖర్చు పెట్టారని, ఇంతకీ ఆ గెస్ట్ హౌస్ ఎవరిదో చంద్రబాబే చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

Guntur District
Undavalli
YSRCP
mp
Vijaya sai
  • Loading...

More Telugu News