Union Budget: కేంద్ర బడ్జెట్: రేట్లు పెరిగేవి ఏవి? తగ్గేవి ఏవి?
- ధర తగ్గనున్న ఈవెహికల్స్, డిఫెన్స్ పరికరాలు
- పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీసీటీవీ కెమెరాల ధర
- మరింత చేదెక్కనున్న సిగరెట్లు, చుట్టలు
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే బడ్జెట్ ఇదని... ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే బడ్జెట్ అని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ బడ్జట్ వల్ల ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయో, ఏయే వస్తువులు చేదెక్కనున్నాయో చూద్దాం.
ధరలు తగ్గేవి:
దిగుమతి చేసుకునే ఈ-వెహికల్స్ విడి భాగాలు, కృత్రిమ మూత్రపిండాలకు వాడే ముడి పదార్థాలు, దిగుమతి చేసుకునే ఉన్ని, దిగుమతి చేసుకునే డిఫెన్స్ పరికరాలు.
ధరలు పెరిగేవి:
పెట్రోల్, డీజిల్, దిగుమతి చేసుకునే బంగారం, దిగుమతి చేసుకునే లోహాలు, సీసీటీవీ మరియు ఐపీ కెమెరాలు (ఇంటర్నెట్ ప్రొటోకాల్ కెమెరాలు), మెటల్ ఫిట్టింగ్స్, దిగుమతి చేసుకునే స్ప్లిట్ ఏసీలు, సిగరెట్లు, చుట్టలు, పొగాకు, పాన్ మసాలా, దిగుమతి చేసుకునే ప్లాటినం, దిగుమతి చేసుకునే ఆటోమొబైల్ పార్ట్స్, దిగుమతి చేసుకునే లౌడ్ స్పీకర్లు, దిగుమతి చేసుకునే ప్లగ్గులు, సాకెట్లు, స్విచ్చిలు, స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులు.