Narendra Modi: ఇది అత్యుత్తమ బడ్జెట్.. ప్రధాని మోదీ స్పందన

  • ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్
  • 21వ శతాబ్దంలో భారత అభివృద్ధిని పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉంది
  • మధ్యతరగతి ప్రజలకు లబ్ధి  చేకూరుతుంది

మోదీ 2.0 ప్రభుత్వ తొలి బడ్జెట్ ను లోక్ సభలో ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అనంతరం మీడియాతో మోదీ మాట్లాడుతూ, ఇది అత్యుత్తమ బడ్జెట్ అని కితాబిచ్చారు. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ అని ప్రశంసించారు. 21వ శతాబ్దంలో భారత అభివృద్ధిని పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉందని చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల పారిశ్రామికరంగం బలపడుతుందని, దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని తెలిపారు. పన్ను విధానాన్ని సరళతరం చేశామని చెప్పారు. మౌలిక వసతులను ఆధునికీకరించేలా బడ్జెట్ ను తీర్చిదిద్దామని అన్నారు. వ్యవసాయరంగాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైనవి బడ్జెట్ లో ఉన్నాయని చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి ప్రజలకు లబ్ధి  చేకూరుతుందని మోదీ అన్నారు.

Narendra Modi
Union Budget
BJP
  • Loading...

More Telugu News