India: డిజిటల్ చెల్లింపులపై సర్ చార్జీ ఎత్తివేత.. పెరగనున్న బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్ ధరలు!

  • తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు
  • లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూపాయి సెస్
  • విదేశీ పుస్తకాలపై సుంకాల వడ్డింపు

డిజిటల్ చెల్లింపులపై సర్ చార్జీలను ఎత్తివేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏడాదికి రూ.కోటి వరకూ నగదును విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్ విధిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం వాటా 51 శాతానికి తగ్గకుండానే పెట్టుబడుల ఉపసంహరణ చేపడతామని వెల్లడించారు. స్టార్టప్ లపై ఉండే పెండింగ్ కేసులను ఎత్తివేయాల్సిందిగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించామని చెప్పారు. పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ఈరోజు 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ముఖ్యాంశాలు..

  • విద్యుత్ వాహనాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు
  • లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఒక రూపాయి సెస్(రోడ్డు, మౌలిక వసతుల సెస్) పెంపు
  • విద్యుత్ వాహనాల కొనుగోలు రుణాలపై రూ.1.5 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు
  • విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పుస్తకాలపై 5 శాతం దిగుమతి సుంకం విధింపు
  • రూ.కోట్లి వార్షికాదాయం ఉంటే అసెస్సీలకు విధిస్తున్న పన్నుపై అనదంగా 7 శాతం సర్ చార్జి విధిస్తాం
  • బంగారం, ఇతర విలువైన లోహాలపై  ఎక్సైజ్ డ్యూటీని 10 నుంచి 12.5 శాతానికి పెంచుతూ నిర్ణయం
  • కస్టమ్స్ చట్టానికి పలు  సవరణలు చేపడతాం
  • రూ.2-5 కోట్ల వార్షికాదాయం పొందే వ్యక్తులపై విధిస్తున్న పన్నుపై 3 శాతం సర్జ్ చార్జీ వసూలు
  • బోగస్ కంపెనీలతో రూ.50 లక్షలు అంతకన్నా ఎక్కువ సుంకాలను ఎగ్గొట్టి మోసానికి పాల్పడితే  నాన్ బెయిలబుల్ కేసుతో పాటు భారీ జరిమానా
ఈ సందర్భంగా బడ్జెట్ కు పార్లమెంటు ఆమోదం తెలపడంతో లోక్ సభ స్పీకర్ బిర్లా సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు.

India
budget
Union Budget 2019-20
nirmala sitaraman
gold and silver prics hike
petrol and diesel rates increase
  • Loading...

More Telugu News