India: రూ.5 లక్షలలోపు వార్షికాదాయానికి పన్నులేదు.. గృహ రుణాల వడ్డీని తగ్గిస్తున్నాం!: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

  • 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రం
  • ఐటీ రిటర్నులకు పాన్ లేదా ఆధార్ ఉంటే చాలు
  • రూ.3.5 లక్షలలోపు గృహ రుణాలపై  వడ్డీ పూర్తిగా మాఫీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న ప్రజలను ఆమె అభినందించారు. డ్వాక్రా మహిళలకు రూ.5000 వరకూ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని 18 దేశాల్లో రాయబార కార్యాలయాలు తెరిచేందుకు అనుమతించామనీ, వాటిలో ఐదింటిని ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభం నుంచి గట్టెక్కించామని పేర్కొన్నారు. వార్షిక టర్నోవర్ 400 కోట్ల వరకూ ఉన్న కంపెనీలపై 25 శాతం కార్పొరేట్ పన్నును వర్తింపజేస్తున్నామని తెలిపారు. ఈ పరిమితి గతంలో రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలకే ఉండేదన్నారు.

బడ్జెట్ 2019-20 హైలైట్స్
  • 2019-20 నుంచి వార్షికాదాయం పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు
  • అంటే రూ.5 లక్షలకు మించి ఆదాయం పొందేవారే పన్ను కట్టాల్సి ఉంటుంది
  • ఎలక్ట్రానిక్ వాహనాలు కొంటే ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తాం
  • ఐటీ రిటర్నుల దాఖలు పాన్ లేదా ఆధార్ ఉంటే చాలు
  • స్టార్టప్ కంపెనీలకు ఐటీ శాఖ తనిఖీల నుంచి మినహాయింపు
  • ఇంటి రుణాలపై వడ్డీ తగ్గింపు.. రూ.45 లక్షల వరకూ రుణాలపై రూ.3.5 లక్షలు మాఫీ
  • గృహ రుణాలపై అదనంగా మరో రూ.లక్షన్నర వరకూ వడ్డీ తగ్గింపు
  • 2018-19లో ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.11.37 లక్షల కోట్లకు చేరింది
  • అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం
  • డ్వాక్రా సంఘాలకు దేశవ్యాప్తంగా వడ్డీ రాయితీ పథకం ప్రకటన

  • Loading...

More Telugu News