Union Budget 2019-20: పుత్రికోత్సాహం.. ‘బడ్జెట్’ ను చూసేందుకు పార్లమెంటుకు చేరుకున్న నిర్మల తల్లిదండ్రులు!

  • నేడు 2019-20 బడ్జెట్
  • కుమార్తెను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు
  • బడ్జెట్ లో కీలక ప్రకటనలు ఉండొచ్చని అంచనాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుమార్తె బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని చూసేందుకు వీలుగా ఆమె తల్లిదండ్రులు నారాయణ్ సీతారామన్, సావిత్రి సీతారామన్ లు పార్లమెంటుకు చేరుకున్నారు. వీరు గ్యాలరీలో కూర్చుని బడ్జెట్ ను వీక్షించనున్నారు. భారత్ ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా మలుస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రకటనకు అనుగుణంగా ఈ బడ్జెట్ లో మెరుపులు ఉండొచ్చని తెలుస్తోంది.

Union Budget 2019-20
nirmala sitaraman
parliament
  • Error fetching data: Network response was not ok

More Telugu News